ఇటీవల కాలంలో రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే రియాక్ట్ అయ్యారు సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన పవన్ వ్యక్తిగతమైన విషయాల్లో వేలుపెట్టేంత పని చేశాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన పవన్ ఫ్యాన్స్ పోసాని కృష్ణ మురళికి ఫోన్ లు చేసి అసభ్యకరంగా మాట్లాడారు.
దీంతో వెంటనే మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వేదికగా పోసాని మాట్లాడుతూ.. నా భార్యను, నా ఇంటి ఆడపడుచులను ఇష్టమైన రీతిలో పవన్ ఫ్యాన్స్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పోసాని అన్నారు. ఇక ఇదే కాకుండా పవన్ కుటుంబ ఆడపడుచులపై కూడా అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో నేడు మంగళగిరిలో జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎంత తిట్టినా తిట్టే కొద్ది బలపడతానన్నాడు. ఇక ఇదే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయనంతరం ప్రమాణస్వీకారానికి నన్ను ఆహ్వానించారని తెలిపాడు. కానీ నేను వెళ్లలేదని, మా పార్టీని ముందు ముందు మరింత నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఆరోజే చెప్పామని పవన్ కళ్యాణ్ అన్నారు.