ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా స్టార్‌గానే కాదు, వరల్డ్ స్టార్‌గా కూడా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఇంప్రెస్ అయిపోయారు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఆయనతో కలిసి 15 నిమిషాలు ముచ్చటించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణ పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌కు చేరుకుని.. జూనియర్ ఎన్టీఆర్‌తో లంచ్ భేటీ కానున్నారు. 15 నిమిషాల పాటు ఈ లంచ్ భేటీ కొనసాగనుంది. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాని తాను చూశానని, ఆ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు తాను ఇంప్రెస్ అయ్యానని, తాను ఎన్టీఆర్‌ను కలవాలనుందని అమిత్ షా తన కోరికను బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను అభినందించేందుకు స్వయంగా ఎన్టీఆర్‌తో ఈ లంచ్ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌తో లంచ్ భేటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.