Home రాజకీయాలు జాతీయ వార్తలు భారత్ లో 50 వేల కొత్త ఉద్యోగాలు: మీరు రెడీనా

భారత్ లో 50 వేల కొత్త ఉద్యోగాలు: మీరు రెడీనా

2020 04 08 scaled 1

కరోనా వలన దేశం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు నిరుద్యోగ శాతం కూడా భారీగా పెరిగింది. కొత్తగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వెలువడింది. ప్రముఖ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలైన ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, శాంసంగ్, డిక్సన్, లావా సంస్థలు భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా 2020 డిసెంబర్ నాటికి దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినా ఫాక్స్‌కాన్ ఇప్పటికే భారత్ లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మొదలుపెట్టాను అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థ ఆపిల్ ఉత్పత్తులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది.

మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు 2020లో మోడీ సర్కార్ పీఎల్‌ఐ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెరగనున్నాయని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు దానికి సంబంధించిన సానుకూలమైన ఫలితాలు వెలువడుతున్నాయి. చైనా మీద నమ్మకం లేని అనేక అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు భారత్ లో తమ యూనిట్ కేంద్రాలను ఏర్పాటు సిద్ధమవుతున్నట్టు పలు అంతర్జాతీయ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి.

తాజా సమాచారం ప్రకారం దాదాపు 33శాతం మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు చైనా నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ‌లో పెరుగుదల గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. దీనివలన నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించడంతోపాటు పరోక్షంగా మరి కొన్ని వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad