వైరల్ అవుతున్న జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్!

jd lakshmi narayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు నటనలే వుంటాయి. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే.

దీంతో పాటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసులపై రాళ్లతో ధ్వంసం చేయటం, ఈ దాడులపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేయటం వంటివి ఏపీలో కాస్త హీట్ పుట్టిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో స్పందించటం ఈ దాడులను ఉద్దేవించేనంటూ నెటిజన్స్ ఆయన పోస్ట్ కు కామెంట్స్ చేస్తున్నారు. మరి లక్ష్మీనారాయణ చేసిన పోస్ట్ నిజంగా ఏపీలో తాజాగా ప్రస్తుత పరిణామాలపైనే కావొచ్చని కొందరు చేవులు కొరుక్కుంటున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.