సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి లకు ఊరట!..

ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. చాన్నాళ్ళుగా వాయిదాలు పడుతోన్న ఈ కేసు ఇవాళ ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చింది, అయితే ఇప్పుడు వాదనలు విన్నాక జగన్ , విజయసాయిరెడ్డి బెయిళ్ళ పిటిషన్లపై కేసు కొట్టేసింది. వారిద్దరి బెయిల్ పిటిషన్స్ రద్దుచేయాలన్న రఘురామకి కోర్ట్ షాక్ ఇచ్చినట్లయింది.  బెయిల్ రద్దు అవుతుందా? లేదా? అంటూ రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. గతంలో  ఆగస్టు 25న పెద్ద ఘటన జరగబోతోందంటూ జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Big relief to Jagan Raghurama bail cancellation case dismissed - Suman TVజగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌‌ వ్యవహారంలో ఎంపీ రఘురామకు చుక్కెదురైంది.    కోర్టులనే అనుమానిస్తారా అని ఎంపీనీ కోర్టు ప్రశ్నించింది. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టుల విశ్వ‌స‌నీయ‌త‌ను అనుమానించ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిందితులు ఇత‌ర దేశాల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తించినంత మాత్రాన కోర్టుల‌నే అనుమానిస్తారా? అని న్యాయ‌స్థానం నిల‌దీసింది. పరిస్థితులకు అనుగుణంగా నిందితులు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టులు అనుమతించడం సాధారణమేనని, తామూ ఇలా చాలామందికి అనుమతులిచ్చామని వ్యాఖ్యానించింది. అంతమాత్రాన కోర్టులను సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరతారని ప్రశ్నించింది. ఈ తీర్పుని స్వీకరించిన రఘురామ రాజు హైకోర్టుకి వెళ్తామని చెప్పడం కొసమెరుపు