బిగ్ బ్రేకింగ్! ఈటల రాజేందర్ రాజీనామా!

అనుకున్నదే అయ్యింది. ఊహించిందే జరిగింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన తరువాత హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా.., ఈ సమయంలో ఆయన తనని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసిన విధానంపై ఎమోషనల్ గా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవం అన్న నినాదంతోనే ఇన్నాళ్లు పోరాటం చేశాను, రాజకీయాలు చేశాను. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. బాధలను సహించాను. 19 సంవత్సరాలుగా ఏ తప్పు చేయని రాజేందర్.. ఓ తప్పు చేశారని కేసీఆర్ రాత్రికి రాత్రి ఎలా నిర్ధారించుకోగలిగారు? ఓ అనామకుడు ఉత్తరం రాస్తే మంత్రిపై చర్యలు తీసుకుంటారా? అసలు ఏమైందో తెలుసుకోకుండానే నాపై చర్యలకి ఆదేశిస్తారా? మీ కుటుంబానికి బంగారు పళ్లెంలో పెట్టి అన్ని రకాల పదవులు ఇచ్చాం. ఇంకా ఏం ఇవ్వాలని తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవంపై దెబ్బ కొడుతున్నారని ఈటల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

raji 2 అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలని చూసిన ప్రతిసారి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాను. గెలిచి చూపించాను. ఇలా ఏనాడైనా రాజేందర్ పదవుల కోసం ఆశ పడ్డాడా? ఆస్తులు సంపాదించుకోవాలని ఎగబడ్డాడా? ఇవన్నీ కూడా కేసీఆర్ కి తెలుసు. కానీ.., ఈరోజు తన కుటుంబ ప్రయోజనాల కోసం నన్ను దూరం పెట్టాలని ఇలా చేశారని ఈటల తెలియచేశారు. ఇక సీఎంవో కార్యాలయం, మంతివర్గంపై కూడా ఈటల రాజేందర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అని చెప్పారు. కానీ.., ఇప్పటి మంత్రి వర్గంలో సీఎంవో కార్యాలయంలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, టీఎన్జీవోలను కూడా కేసీఆర్ కలవడానికి ఇష్టపడటం లేదని.., ఇన్నాళ్లు పార్టీ కోసమే ఈ అవమానాలు భరించామని ఆయన తెలియచేశారు. అయితే.., ప్రభుత్వ తీరుపై, కేసీఆర్ వ్యవహార శైలిపై ఇన్ని కామెంట్స్ చేసిన ఈటల.., తాను బీజేపీలో చేరే అంశంపై మాత్రం స్పందించలేదు. కానీ.., ఈ నెల 8 లేదా 9వ తేదీలలో ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి.., ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.