బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత నారాయణ

narayana

తెలుగు బుల్లితెరపై భారీ వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకు దగ్గరైన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ ఘనంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని బిగ్ బాస్ 5 తెలుగు ఈ మధ్యే ప్రారంభమైంది. అయితే ఇందులో ఎప్పటిలాగానే భోవొద్వేగంతో కూడిన సంభాషణలు, గోడవలు, అల్లర్లు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ షోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇందులో పొగిడే వాళ్ళు ఎంతుంటే.. తిట్టేవాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షోపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షోతో విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి షోలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తారని ఆయన మండిపడ్డారు. ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. సభ్యసమాజాన్ని చెడుదారులకు తీసుకెళ్తున్న ఈ షోను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో పై మండిపడుతున్న సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి