నిత్యావసర సరుకుల డెలివరీకి జొమాటో గుడ్‌బై!

Zomato Services Discontinuation - Suman TV

నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్‌ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది.  మనకు కావాల్సినవి జొమాటో యాప్ లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకు వచ్చి ఇచ్చేవారు. అయితే ఇకపై నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలు నిలిపివేస్తున్నట్లు జొమాటో తెలిపింది. ‘కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ అమలైన గతేడాదిలోనే ప్రయోగాత్మకంగా కిరాణా సరుకులను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన 45 నిమిషాల్లోనే ఖాతాదారులకు సరుకులు అందించే హామీతో ఈ సంవత్సరం జూలైలో ఈ సేవలు ప్రారంభించింది. అయితే సకాలంలో సరుకులు అందించలేక పోవడంతో కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ వ్యాపారానికి గుడ్‌బై చెప్పడమే మేలని జొమాటో నిర్ణయించినట్టు సమాచారం.

 ‘స్టోర్లలో వస్తువుల జాబితా   నిల్వ స్థాయిలూ తరచూ మారుతున్నాయి.  దీని కారణంగా ఆర్డర్లలో అంతరం ఏర్పడి పేలవమైన కస్టమర్ల అనుభూతికి దారితీస్తోంది. మా వేదిక ద్వారా ఇకపై సరుకుల డెలివరీని ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోం. 10 నిముషాల్లోనే సరుకుల డెలివరీతో గ్రోఫర్స్‌ అధిక నాణ్యమైన సేవగా నిలిచింది. జొమాటో వేదిక ద్వారా సరుకుల డెలివరీ ప్రయత్నాల కంటే గ్రోఫర్స్‌లో కంపెనీ పెట్టుబడులు భాగస్వాములకు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి’ అని జొమాటో స్పష్టం చేసింది. జొమాటో  నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ఎంపిక చేసిన నగరాల్లో పైలట్‌ ప్రా జెక్ట్‌ కింద గతేడాది ప్రారంభించింది. కాగా,  గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటా కోసం రూ.745 కోట్లు వెచి్చంచినట్టు జొమాటో గతంలో తెలిపింది.  ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో తన కిరాణా డోర్ డెలివరీ సేవలను సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Zomato Services Discontinuation - Suman TVవినియోగదారుల నుంచి ఆశించినంత రీతిలో స్పందన రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గ్రోఫర్స్ సంస్థ ఇతర కిరాణా సంస్థల కంటే మెరుగైన ఫలితాలను సృష్టిస్తుందని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది.  తాజా ప్రకటన ద్వారా గతేడాది నుంచి చూస్తే, నిత్యావసరాల సేవ నుంచి జొమాటో తప్పుకోవడం ఇది రెండోసారి. నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.745 కోట్లు) పెట్టుబడి పెట్టి, మైనారిటీ వాటాను జొమాటో తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు