లక్షలు ఖర్చు పెట్టి భార్యను వీదేశాలకు పంపిస్తే.. చివరికి ఆమె ఏంచేసిందంటే

స్పెషల్ డెస్క్-కలికాలంలో నమ్మంపైనే నమ్మకం లేకుండా పోతోంది. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేస్తారో అంతుబట్టడం లేదు. ఎడా పెడా పెరిగిపోతున్న దగాలు, మోసాలతో చాలా మంది బలైపోతున్నారు. ఆఖరికి పవిత్రమైన వివాహ బంధాన్ని కూడా స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్నారు సమాజంలోని కొందరు. పంజాబ్ లో ఓ యువతి వీదేశాలకు వెళ్లేందుకు పక్క ప్రణాళికతో పెళ్లి చేసుకును, తీరీ అక్కడికి వెళ్లాక షాక్ ఇచ్చింది.

ఈ ఘటన పంజాబ్‌ లోని బటాలా నగరంలో చోటుచేసుకుంది. 23 ఏళ్ల ఇస్సాకు 2020 ఫిబ్రవరిలో ఆకాశ్‌ దీప్‌తో పెళ్లి జరిగింది. ముందు నుంచి ఇస్సాకు విదేశాల్లో చదవాలని కోరిక. అదే విషయాన్ని పెళ్లికి ముందే అత్తింటి వారితో చెబితే, ఆమె విదేశాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చంతా ఆకాశ్ కుటుంబం భరించాలని ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇస్సా అక్కడకు వెళ్లాక, భర్త ఆకాశ్‌ దీప్‌ కు కూడా వీసా స్పాస్సర్ చేయాలి.

Cheating 1

ఈ క్రమంలో ఆకాశ్‌ దీప్ కుటుంబం కోడలి ఆస్ట్రేలియా చదువు కోసం 14 లక్షలు ఖర్చు చేసింది. ఇక ఆకాష్ దీప్ సైతం ఆస్ట్రేలియా వెళ్లేందుకు రేడీ అవుతున్న టైంలో పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. ముందు భర్తకు వీసా స్పాన్సర్ చేసేందుకు ఓకే అన్న ఇస్సా ఆ తరువాత మాట మార్చింది. కావాలని భర్తతో గొడవ పడి, వీసా అప్లికేషన్ ఉపసంహరించుకునేలా చేసింది. ఆ తరువాత కూడా ప్రణాళికలో భాగంగా అత్తింటి వారందరితో తగువు పెట్టుకుని, చివరికి ఇస్సా తన స్పాన్సర్‌ షిప్‌ను వెనక్కు తీసుకుంది.

ఇంకేముంది తాము మోసపోయామని చాలా ఆలస్యంగా తెలుసుకున్న ఆకాశ్‌ దీప్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. వారి ఆరోపణల ఆధారంగా పోలీసులు ఇస్సా, ఆమె తండ్రిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. ఐతే ఇస్సా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండటంతో ఏంచేయాలో పోలీసులకు సైతం పాలుపోవడం లేదు. సమాజంలో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.