బేబమ్మకు తండ్రిగా చేశాను, ఆమెతో రొమాన్స్ చేయలేను

ఫిల్మ్ డెస్క్- కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె అమాయకమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకేముంది ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టికి సినిమాల మీద సినిమాలు వచ్చిపడ్డాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం కృతి శెట్టి తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే అతియోశక్తి కాదు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. తన పక్కన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోందంటే మాత్రం ఆయన కంగారు పడిపోయారు. వెంటనే వద్దు వద్దు.. కృతి శెట్టి పక్కన నేను నటించను అని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. అదేంటీ అంత అందమైన అమ్మాయి పక్కన నటించను అని చెప్పిందెవరని ఆలోచిస్తున్నారా.. యస్ ఆయన మరెవరో కాదు విజయ్ సేతుపతి.

Krithi Shetty 1

స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలతో ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. తెలుగులో చిరంజీవి సైరాలోను నటించారు. ఆ తరువాత ఉప్పెన సినిమా కూడా చేశారు. ఈ సినిమాలో రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు విజయ్ సేతుపతి.

ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలో లాభం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి కృతి సెట్టి గురించి చెప్పారు. ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో ఓ మూవీ చేసిన విజయ్ సేతుపతి, అందులో కృతి శెట్టి హీరోయిన్‏గా ఉంటే బాగుంటుందని చిత్రయూనిట్ సభ్యులు అనుకున్నారట.

ఇదే విషయాన్ని తనతో చెబితే.. వెంటనే తాను ఆమెతో సినిమా చేయను అని చెప్పారట. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించానని, ఇప్పుడు ఆమె పక్కన హీరోగా చేయమంటే ఎలా చేస్తానని ప్రశ్నించారట విజయ్ సేతుపతి. ఇప్పుడే కాదు ఎప్పటికీ కృతి శెట్టి పక్కన హీరోగా నటించనని తేల్చి చెప్పారు. అదన్న మాట సంగతి.