గోవాలో విజయ్ దేవరకొండ.. ‘లైగ‌ర్’ పవర్‌ఫుల్ ఫోటో వదిలిన టీమ్

ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విజయ్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఒక్క టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను సినీ తారలు విజయ్ కి ఫిదా అయిపోయారు. విజయ్ దేవరకొండ ఎంచుకునే కధలు, ఆయన మేనరిజం అభిమానులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నట్లు తాజాగా విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పేరు లైగర్. సాలా క్రాస్‌బీడ్‌ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక లైగర్ మూవీకి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

Liger 1

ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు బుధవారం నుంచి గోవాలో ‘లైగర్‌’ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయినట్లుగా చిత్ర యూనిట్ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్‌ను షూట్ చేయనున్నారట. ఇందుకు సంబందించి విజ‌య్ దేవ‌ర‌కొండ, ఛార్మి ట్వీట్ చేశారు. బ్లడ్..స్వెట్… వైలెన్స్. లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పవర్‌ ఫుల్ స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నారు. చూస్తుంటే ఆయన మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో ఫారెన్ ఫైటర్స్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. అన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వచ్చే సంక్రాతికి లైగర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.