ఇండియన్ డ్రైవర్ కి యూఏఈలో మరణ శిక్ష! చివరి నిమిషంలో ఉరి క్యాన్సిల్ చేసి క్షమాపణ చెప్పారు!

కొన్ని దేశాల్లో చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు విధిస్తుంటారు. మన దగ్గర ఓ దోషికి ఉరి శిక్ష వేయాలంటే ఆ నేరం చాలా పెద్దది అయ్యి ఉండాలి. కానీ.., అరబ్ దేశాలలో ఇలా కాదు. తెలిసి చేసినా, తెలియక యాక్సిడెంటల్ గా చేసినా.., ఓ వ్యక్తి చావుకి కారణమైతే మాత్రం కచ్చితంగా ఉరి శిక్ష విధిస్తారు. అక్కడ ఒక్కసారి కోర్టు శిక్ష విధించింది అంటే.., రాష్ట్రపతి క్షమాభిక్ష లాంటివి ఉండవు. ఉరికంపం ఎక్కాల్సిందే. కానీ.., మన దేశానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి యూఏఈ సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. చావు అంచుల వరకు వెళ్లిన అతను ఇప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అంతేకాదు త్వరలో కుటుంబాన్ని కలుసుకోవడానికి స్వదేశం రానున్నాడు. అసలు ఒక ఇండియన్ కి, యూఏఈ లో ఉరి శిక్ష ఎందుకు పడింది? అతను ఆ శిక్షని నుండి ఎలా తప్పించుకున్నాడు? అతని ప్రాణాలను కాపాడింది ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కేరళకు చెందిన బెక్స్ కృష్ణన్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అతడికి యూఏఈలో డ్రైవర్‌గా ఉద్యోగం దొరికింది. అయితే 2012 సెప్టెంబరులో ఇతను ఓ రోడ్ ప్రమాదానికి కారణం అయ్యాడు. ఈ యాక్సిడెంట్ లో సుడాన్‌కు చెందిన ఓ కుర్రాడు చనిపోయాడు. యూఏఈ సుప్రీం కోర్టు కృష్ణన్ ని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి కృష్ణన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడిని విడుదల చేయించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు.

uaeయూఏఈ దేశంలో ఎవ్వరికీ క్షమాబిక్ష పెట్టే అధికారం ఉండదు. ఒక్క బాధిత కుటుంబానికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. దీంతో.., కృష్ణన్ బంధువులు సుడాన్లో ఉంటున్న బాధిత కుటుంబాన్ని చాలాసార్ల వేడుకున్నారు. కానీ.., వారు ఒప్పుకోలేదు. ఇలా దిక్కుతోచని స్థితిలో కృష్ణన్ కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయుడు, లులూ గ్రూప్ ఛైర్మెన్ అయిన ఎంఏ యూసఫ్ అలీ సహాయాన్ని కోరారు. ఆయన బాధిత కుటుంబాన్ని క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పించారు. ఇందుకోసమే ఆయనే ఏకంగా 500,00ల దిర్హామ్‌లు నష్ట పరిహారంగా చెల్లించారు. మన కరెన్సీలో వీటి విలువ దాదాపు రూ.కోటి. దీంతో.., ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత జైలు నుంచి కృష్ణన్ విడుదలయ్యాడు. ఇది నాకు నిజంగా పునర్జన్మే. నేను బయట ప్రపంచాన్ని చూస్తాననే నమ్మకాన్ని కోల్పోయా. యూసుఫ్ అలీని చేసిన సహాయాన్ని మరచిపోలేను అంటూ కన్నీరు పెట్టేశాడు. బెక్స్ కృష్ణన్ సుమారు 10 ఏళ్ళ పాటు.., యూఏఈ జైలులో గడిపారు. అక్కడ కూడా ఆయనకి క్రమశిక్షణ గల ఖైదీగా గుర్తింపు లభించింది. అక్కడ ఉండే పోలీసులకి కూడా నేను చాలా ఇష్టం. నన్ను ఉరి తీయడం వాళ్లకి కూడా ఇష్టం లేదు. ఈ విషయంలో వారు నాకు చాలాసార్లు క్షమాపణ చెప్పేవారని కృష్ణన్ తెలియచేశాడు. ఏదేమైనా. అసలు ముక్కు మొహం కూడా తెలియని ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి కోటి రూపాయలు చెల్లించిన లులూ గ్రూప్ ఛైర్మెన్ ఎంఏ యూసఫ్ అలీ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.