దసరా పండగ రోజు తెలంగాణలో 200 కోట్ల మధ్యం అమ్మకం

హైదరాబాద్- విజయ దశమి.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దుర్గామాతను భక్తి శ్రద్దలతో పూజించారు. తెలంగాణ విషయానికి వచ్చే వరకు దసరా అతి పెద్ద పండగ. తెలంగాణ వాసులు దసరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి దసరా అంటే ముక్క, చుక్క ఉండాల్సిందే కదా. అదేనండీ మాంసం, మధ్యం ఉంటేనే దసరా పండగ అవుతుందన్నమాట.

ఇక తెలంగాణలో దసరా పండుగరోజు మధ్యం ప్రియులు మస్తు మజా చేశారు. కేవలం దసరా పండగ ఒక్క ఒక్కరోజే తెలంగాణలో 200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. గత సంవస్తరంతో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా సందర్భంగా ఒక్క రోజు దాదాపు 180 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు మధ్యం దుకాణాదారులు. గతంలో ఉన్న స్టాక్‌తో కలిసి మొత్తం 200 కోట్ల మద్యం అమ్ముడయిందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

wine shop 1

గతంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిన రోజు 130 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడయుందని అధికారులు చెప్పారు. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్‌ విక్రయాల్లో 39 శాతం, బీర్ల విక్రయాల్లో 57 శాతం వృద్ధిరేటు నమోదయిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఇక ఈ సారి దసరా పండగ సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల్లోనే 685 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఇంకేముంది తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. గత సంవత్సరం దసరా సందర్భంగా ఈ అమ్మకాలు 406 కోట్ల దాకా జరిగాయి.

ఇక అత్యధికంగా హైదరాబాద్‌ 190 కోట్లు, హనుమకొండలో155 కోట్లు, రంగారెడ్డి 194 కోట్లు, నల్లగొండలో 128 కోట్లు, మేడ్చల్‌లో 103 కోట్లు, కరీంనగర్‌లో 94 కోట్లు, ఖమ్మంలో 90 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 72 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 487 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెప్పారు. అంతే కాదు ఈ నెలాఖరు వరకు మరో 1600 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది.

ఈ దసరాకు ఐదు రోజుల్లోనే 7.90 లక్షల కేసుల లిక్కర్‌, 8.34 లక్షల కేసుల బీరు అమ్ముడయింది. ఈ నెలలో గత 12 రోజుల్లో 1,430 కోట్ల విలువైన 17.20 కోట్ల కేసుల లిక్కర్‌, 16.27 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. మరి మందుబాబులా మజాకా..