తిరుపతిలో కుంగుతున్న ఇళ్ళు! 18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు!

Buildings are Shriking in Thirupati - Suman TV

తిరుపతి.. ఆధ్యాత్మిక నగరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దేశ విదేశాల్లో నుండి కూడా ఈ ప్రాంతానికి భక్తులు వస్తుంటారు. ఇలాంటి మంచి కారణాలతో వార్తల్లో నిలిచే తిరుపతికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. తిరుపతిలోని ఎంఆర్‌ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏదో ఒకటి, రెండు ఇళ్లకి ఇలా జరిగింది అంటే పెద్దగా ఆశ్చర్యపోయావాల్సిన అవసరం లేదు. కానీ.. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు వారంతా ఆ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు.

తిరుపతిలో ఉన్న ఈ ప్రాంతంలోనే కొన్ని రోజుల ముందు మునెమ్మ అనే ఓ మహిళ బావిని శుభ్రం చేస్తుండగా.. బావిలోని సిమెంట్ ఒరలు ఒక్కసారిగా పైకి లేచాయి. మొత్తం 18 సింమెంట్ ఒరలులో 7 పైకి వచ్చేశాయి. ఈ ఘటనలో బావిలో ఉండిపోయిన ఆ ఇంటి ఇల్లాలు మునెమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. సరిగ్గా.., అదే సమయంలో మునెమ్మ భర్త బయట నుండి ఇంటికి రావడం, బావి లోపల నుండి భార్య కేకలు విని, ఆమెని కాపాడటంతో మునెమ్మ ప్రాణాలు నిలిచాయి.

Buildings are Shriking in Thirupati - Suman TVదీనిపై ఇప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ మధు క్లారిటీ ఇచ్చారు. నదీ పరీవాహిక ప్రాంతాలలో భూమి కింది పొరల్లో నీటి ఒత్తిడి పెరిగి, ఇలా జరుగుతుందని జియాలజీ ప్రొఫెసర్ మధు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో అదే ప్రాంతంలోని ఇళ్లకు బీటలు వస్తుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు తిరుపతి వాసులను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు కాస్త ఉపశమనం లభించింది అనుకునేలోపు ఇప్పుడు ఇలాంటి ఘటనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మరి.. శ్రీవారి నిలయమైన తిరుపతి నగరానికి ఒకేసారి ఇన్ని కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.