సినిమాల్లో హీరోలు పంచ్ డైలాగ్‌లు వేస్తే.. ప్రేక్షకులు ఎలా ఊగిపోతారో.. ఆయన స్టేజీ మీద వేసే పంచ్‌లకు సామాన్య ప్రజలు కూడా అదే రేంజ్లో ఈలలు, చప్పట్ల మోత మోగిస్తారు. సీఎం, అయినా పీఎం అయినా సరే మాటలతో ఊతికేస్తాడు. ప్రజల పక్షనా నిలిచి.. ఎదుటి వాడు ఎంతటివాడు కానీ.. నిలదీస్తాడు. అధికార పక్షం ఎన్ని బెదిరింపులకు దిగినా.. భయపడేది లేదంటాడు. ఆయన మాటలకు పాలకపక్షం సైతం బెదిరిపోతుంది. ఆయనే డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డి. టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కాంగ్రెస్ పగ్గాలు ఆయన చేతికి ఇచ్చాకే ఆ పార్టీలో, కార్యకర్తల్లో కాస్త హుషారు వచ్చింది. సందర్భం దొరికిన ప్రతి సారి టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడుతుంటారు రేవంత్ రెడ్డి.
ఇక ఎప్పుడు రాజకీయాలు, సభలు, సమావేశాలు అంటూ బిజీబిజీగా ఉండే నేతలకు కాస్త రిలీఫ్ ఇచ్చేది వారి కుటుంబాల్లో జరిగే వేడుకలు. బయట ఒత్తిళ్లను మర్చిపోయి.. రిలాక్స్ అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే తమలోని ప్రత్యేక టాలెంట్‌ని బయటపెడుతుంటారు. కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు హాజరయిన జగ్గారెడ్డి.. డీజే టిల్లు పాటకి మాస్ డ్యాన్స్ చేసి అందదరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి కూడా తన టాలెంట్ ప్రదర్శించి.. అందరిని ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ: రాంగోపాల్ వర్మ
రేవంత్ రెడ్డి అన్న కుమారుడి వివాహ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ పెళ్లి సందర్భంగా నిర్వహించిన బరాత్ వేడుకల్లో రేవంత్ రెడ్డి కర్రసాము ప్రదర్శన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తీన్మార్ బీట్లకు రేవంత్ కర్రసాము చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టూ ఉన్నవారు విజిల్స్ వేసి.. గోల చేస్తూ.. సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి కర్ర సాము వీడియోపై మీరు ఓ లుక్కేయండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే: మంత్రి ఎర్రబెల్లి