నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. ఫ్రెండ్ పై ఫిర్యాదు చేసిన పదేళ్ల బాలుడు!

సాధారణంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అందుకే సర్వసాధారణంగా ఏదైనా గొడవ పెద్దల సమక్షంలోనే తేల్చుకుంటారు.. మరీ క్లిష్టతరమైన విషయం అయితేనే పోలీస్ కంప్లేంట్ వరకు వెళ్తారు. తాజాగా ఓ పదేళ్ల కుర్రాడు తాను ఆడుకుంటున్న సమయంలో తలపై అనవసరంగా కొట్టాడు సార్ ’ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన స్నేహితుడిపై ఫిర్యాదు చేశాడు. కుర్రాడు రావడం.. ధైర్యంగా మాట్లాడుతూ ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు.

fag min 1వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని న్యూకాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. రవిబాబు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని గ్రౌండ్ లో ఆడుకుంటున్న సమయంలో ఓ 14ఏళ్ల కుర్రాడు వచ్చి తలపై బలంగా కొట్టాడు. దాంతో రవిబాబు చుట్టు పక్కల ఉన్నవారికి ఫిర్యాదు చేయకుండా ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.

నేను గ్రౌండ్ లో ఆడుకుంటుంటే.. నన్ను అనవసరంగా కొట్టా డు సార్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి మీ తల్లిదండ్రులు ఎక్కడ అని ప్రశ్నిస్తే వారు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. తర్వాత ఓ హూంగార్డును పంపించి బాలుడిని కొట్టిన కుర్రాడిని మందలించారు.