రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైపోయింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కసరత్తును ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అధికారులు పూర్తి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా తదుపరి ప్రక్రియపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో 3,453 పోస్టుల భర్తీకి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: భూం భూం బీర్, పవర్‌స్టార్ బీర్లు తెచ్చింది చంద్రబాబే: సీఎం జగన్
గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. పోలీసు నియామక శాఖ ద్వారా జైళ్ల శాఖలో 154 పోస్టులు, పోలీసు డిపార్ట్ మెంట్లో 16,587 పోస్టులు భర్తీ చేస్తారు. వైద్యారోగ్య శాఖలో 2,662, డిప్యూటీ కలెక్టర్ 42, డీఎస్పీలు 91, ఎంపీడీవోలు 121, వైద్యారోగ్య శాఖ పాలనాధికారి 20 పోస్టులు, వాణిజ్య పన్నులశాఖలో 48 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశారు. వీటితోపాటు టెట్ నిర్వహణకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.