స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా.. ఈ మధ్యనే ఆయన్ని కలిసిన కేసీఆర్, జగన్!

గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. ఇటీవల కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం మళ్లీ విజృంభిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా నిర్ధారణ అయ్యింది.

image 0 compressed 6తన మనవరాలి వివాహం అనంతరం పోచారం అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటీవ్ అని తేలింది. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పోచారం కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.