ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం !

పోలీస్ శాఖ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరుస్తూ.. ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో క్రమంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతూ సంస్థ భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తోంది.

agasg min 1ఈ నేపథ్యంలోనే సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వివాహం, ఇతర వేడుకల కోసం ఆర్టీసీ బస్సును బుక్ చేసుకోవాలంటూ డిపాజిట్ కట్టాల్సి వచ్చేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిపాజిట్ లేకుండానే బస్సును బుక్ చేసుకునే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి ఆర్టీసి గురువారం ట్వీట్ చేసింది.

వేడుకల కోసం బస్సు కావాలనుకుంటే నేరుగా డిపో మేనేజర్ లను సంప్రదించాలని పేర్కొంది. ఇక ఆర్టీసి తీసుకున్న ఈ నిర్ణయం తో ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సును బుక్ చేసుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సజ్జన్నార్ ప్రజల నుండి ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.