ఈ ఘోరం చూస్తుంటే.. నా రక్తం మరిగిపోతోంది: రేవంత్ రెడ్డి

నగరంలో టీ కాంగ్రెస్ నిరుద్యోగ సైరన్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు… ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్ట్‌ చేశారు. దిల్‌షుఖ్ న‌గ‌ర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టాన‌లని నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేర‌కు పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు దిల్‌షుఖ్ న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం.. ఎల్బీన‌గ‌ర్‌లోని కూడ‌లిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్ర‌హం వ‌ద్ద కాంగ్రెస్ కార్య‌కర్త క‌ళ్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

gae‘జంగ్ సైరన్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారగా, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గాయపడ్డారు. ఆయనను కాంగ్రెస్ శ్రేణులు ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ బల్మూర్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ అరాచకం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది… రక్తం మరిగిపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఈ అరాచకం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది… రక్తం మరిగిపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న తెలంగాణ పోలీసులు నిరుద్యోగులను ఉగ్రవాదుల్లా భావిస్తున్నారని, అందుకు కారణం వారు ఉద్యోగాలను డిమాండ్ చేయడమేనని విమర్శించారు. హక్కుల సాధనలో తమను లాఠీలు, బుల్లెట్లు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. తెలంగాణను ఎందుకోసం సాధించుకున్నామో, అది సాకారం చేసుకునే క్రమంలో తమను ఎవరూ అడ్డుకోలేరు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.