వర్షంతో పాటు ఆకాశం నుంచి పడ్డ ఎర్రచందనం చేప… జాలరికి హర్షం!..

రుతుపవనాల రాకతో అన్నదాతలకే కాదు జీవరాశికీ పండుగ వచ్చేసినట్లే. ఇప్పటివరకు కలుగుల్లోవున్న రకరకాల జీవరాశులు కాస్తా వర్షాలతో బయటకొచ్చి అందరినీ కనువిందు చేస్తాయి. వర్షంతో పాటు చేపలు కురుస్తున్నాయంటూ పక్క గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకుని వాటిని ఏరుకుని తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో థాయ్‌లాండ్‌ చోటు చేసుకుంది. రీసెంట్ గా తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన వీరగాని రమేష్‌కు 12 కేజీల బరువున్న ఎరుపు రంగులో కనిపించే అరుదైన ‘ఎర్ర చందనం’ రకం చేప లభ్యమైంది. red frogsఆ చేపను చూసిన అతను ఎంతో ఆశ్చర్యానికి గురై జిల్లా మత్స్యశాఖకు సమాచారాన్నందించారు. ఒక్క చేపలే కాదు రంగు రంగుల కప్పలు నీటిలో తేలియాడుతున్నాయి.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో ఖిల్లా వరంగల్‌ కోట పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. ఇలాంటి రంగు కప్పలని ఎప్పుడూ చూడని స్థానికులు వాటినెంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య – ఎర్రచందనం రకపు చేపలు తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్‌ అని తెలిపారు.