జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వివాదం ముదురుతోంది. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అయితే పోసాని వ్యాఖ్యలపై జనసేన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. నిన్నటి నుంచి తన కుటుంబీకులను.. ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేసుకొని అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారని మండి పడ్డారు పోసాని.
‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ హ్యాష్ ట్యాగ్.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లో ఆవేశంగా మాట్లాడుతూ.. పవన్ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. నిన్న ప్రెస్‌మీట్ నిర్వహించినప్పటి నుంచి నాకు వేలల్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. నన్ను బూతులు తిడుతూ పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పవన్‌ను ప్రశ్నించివారెవరైనా వారిపై దాడులు చేస్తారా? మరి పవన్ కల్యాణ్ మాత్రం ఎవరినైనా తిట్టొచ్చా? అని పోసాని మండిపడ్డారు. ఫ్యాన్స్ ని అడ్డు పెట్టుకొని పవన్ నియంతలా ప్రవర్తిస్తున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.