బస్సు ప్రయాణీకులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్

కొత్తగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక వస్తు వస్తూనే తన సరికొత్త ప్లానింగ్ తో ఆర్టీసీలో కూడా తన మార్క్ చూపించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా దసరా పండగ తరుణంలో ఎండీ సజ్జనార్ బస్సు ప్రియాణికులకు తీపి కబురునందించారు. టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

Good News for TSRTC Travellers - Suman TVఈ నేపథ్యంలో దసరా పండగ సమయంలో ఖచ్చితంగా ఛార్జీలు పెంచె అవకాశం ఉంటుందని ప్రయాణికులు అంతా ఊహించారు. కానీ దీనికి విరుద్దంగా నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. పండగ వేళ తిరిగే బస్సులకు ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని సజ్జనార్ తెలిపారు. ఇప్పటికీ 4035 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని, గత 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 30 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు ఎండీ సజ్జనార్.