ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన కన్నాయిగూడెం

Kannaigudem Best Village - Suman TV

ప్రపంచ దేశాల్లో కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ వైరస్ దెబ్బకి లక్షల్లో మరణించారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో కరోనా నియంత్రణకు ఓ గ్రామం చేసిన కృషికి అరుదైన గౌరవం లభించింది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామపంచాయాతీకి ఉత్తమ కరోనా నియంత్రణ గ్రామం అవార్డు లభించింది. వివరాల్లోకి వెళ్తే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీకి అరుదైన గౌరవం లభించింది.

ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసినందుకు గాను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIDRF) కన్నాయిగూడెంను ఉత్తమ కరోనా నియంత్రణ పంచాయతీగా ఎంపిక చేసింది. అసోంలో రెండు, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లలో ఒక్కో పంచాయతీ ఈ గౌరవం దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కన్నాయిగూడెం పంచాయితీ ఎంపిక కావడం విశేషం. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సంస్థ వ్యవస్థాపక ఉత్సవాల్లో కన్నాయిగూడెం సర్పంచ్ భూక్యా భాగ్యలక్ష్మి ఈ పురస్కారం అందుకోనున్నారు.