స్నేహితుడి మరణవార్త విని తట్టుకోలేక యువకుడు సూసైడ్!

friends died

హత్య, ఆత్మహత్య, వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలు వంటివి సమాజంలో పేట్రేగిపోతున్నాయి. ఆస్తి కోసం తోబుట్టువులను కూడా లెక్కచేయకుండా పొట్టన పెట్టుకుంటున్న గొప్పవారు లేకపోలేదు. ఈ వార్త చదివాక అబ్బా.. సమాజంలో ఇంకా విలువలు, స్నేహం అనే బంధం బతికే ఉంది అని అనుకుంటారు. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అనే మాటకు అసలైన నిర్వచనం ఈ మిత్రులు. తనతో కలిసి మెలిసి తిరిగిన వాడు ఇక లేడని తెలిసి.. అతనితో ఇంక మాట్లాడలేను, అరేయ్‌ బావ అని పిలవలేను అనే మనస్తాపంతో ఒక యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అసలు విషం ఏంటంటే.. తూప్రాన్ మున్సిపల్​ పరిధి రావెల్లి గ్రామానికి చెందిన భారతమ్మ, సత్తయ్య కొడుకు గిరికుమార్(26). రోజువారీ కూలీగా పనులు చేస్తుంటాడు. ఒక వారం నుంచి అతను సరిగ్గా ఉండటం లేదు. అతని రెండేళ్ల క్రితం దీక్ష అనే యువతితో వివాహమైంది. గిరికుమార్‌కు రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. గిరికుమార్‌ ప్రాణ స్నేహితుడు మల్లేశం వారంక్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి గిరికుమార్‌ ప్రవర్తన సరిగా ఉండట్లేదు. పని డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టసాగాడు. ఎలాగోలా వారం గడిపాక ఇక ఉండలేక గిరికుమార్‌ కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రుడి మరణవార్త తట్టుకోలేకే ఇలా చేశాడు అని చెప్తున్నారు. ఆ వాదనకు బలం చేకూర్చేలా గిరికుమార్‌ ఆత్మహత్యకు ముందు మల్లేసంతో దిగిన ఫొటోని స్టేటస్‌ పెట్టాడు. దాని కింద ‘నిన్ను వదిలి ఉండలేకపోతున్నారా.. నేను కూడా నీ దగ్గరకే వస్తున్నా’ అంటూ రాశాడు.

ఇదీ చదవండి: ‘ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ ధోనీపై కోహ్లీ ప్రశంసలు.. ఎగిరి గంతేశానంటూ..

friends diedఆ స్టేటస్‌ చూసిన మిత్రులు, కుటుంబసభ్యులు వెళ్లి చూస్తే అప్పటికే గిరికుమార్‌ పురుగుల మందు తాగి ఉన్నాడు. స్థానిక ఆస్పత్రికి తరలించగా.. హైదరాబాద్‌ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ గిరికుమార్‌ మరణించాడు. స్నేహితుడి పరంగా గిరికుమార్‌ విషయం విని అందరూ భావోద్వోగానికి లోనవుతున్నారు. కానీ, గిరికుమార్‌ భార్య, అతని రెండు నెలల బిడ్డ, అతని తల్లిదండ్రులను ఇలా వదిలేసి అతను ఆత్మహత్య చేసుకోవడం ఎంతమాత్రం సమర్థించ దగిన అంశం కాదు. గిరికుమార్‌ చేసింది సరైన పనేనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.