బ్రేకింగ్ : తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు!

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కరోనా ఎఫెక్ట్ గత ఏడాధి విద్యా వ్యవస్థపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. స్కూల్స్‌, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్‌ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. అయితే ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులకు పెద్దగా ఉపయోగం లేదని ఇటీవల వచ్చిన రిజల్ట్ ని బట్టి తెలిసిందని అంటున్నారు.

schoor minఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు . ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది సర్కార్. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులను పొడిగించాలని విద్యాశాఖకు వైద్య ఆరోగ్యశాఖ సిఫార్స్ చేసింది. దీంతో ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో పరిస్థితులు మళ్లీ ఎదురవుతాయా అన్న టెన్షన్ లో పడిపోయినట్లు తెలుస్తుంది.