వాహన దారులకు గుడ్ న్యూస్.. ఇక హెల్మెట్ చలాన్లపై..!

Good news for motorists - Suman TV

నగరంలోని ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులు అప్పడప్పుడు తప్పించుకూంటూ ఉంటారు. హెల్మెట్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ , యూజర్ చార్జీలు, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలా ఏది లేకపోయిన ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా చలాన్ల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వాహనదారులకు ఇప్పుడు కాస్త శుభవార్ అనే చెప్పాలి. ఇక విషయం ఏంటంటే..? హెల్మట్ ధరించకపోతే రూ.100, యూజర్ చార్జీలపేరు మీద రూ.35 ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్నారు.

Good news for motorists - Suman TVఈ నేపథ్యంలోనే సామాజిక వేత్త విజయ్ గోపాల్ యూజర్ చార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇదే కేసుపై స్పందించిన న్యాయస్థానం సంబంధిత కోర్టుకు కేసును బదిలీ చేసింది. ఇక విజయ్ గోపాల్ స్పందిస్తూ మరికొన్ని రోజుల్లో యూజర్ చార్జీల నుంచి కాస్త ఉపశమనం లభించబోతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.