జోరు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!

గత కొన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. మొన్న రాత్రి భారీ వర్షాలు పడ్డాయి.. మరోసారి వర్షాలు హైదారాబాద్‌ను ముంచెత్తాయి.. నగరంలోని పలు చోట్ల వర్షంతో రోడ్లు జలమయ్యాయి. గత నెల రోజులుగా హైదరారాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్షాలు మరోసారి నేటి సాయంత్రం రోడ్లను ముంచెత్తాయి.

agsgasg minనగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడడంతో రోడ్లన్ని జలమయ్యాయి. కాలువలు ఉప్పొంగడంతోపాటు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. నిన్న సాయంత్రం నుంచి ఉరుములు.. మెరుపులతో భారీగా వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి.. మరికొన్ని చోట్ల పాత భవనాలు, మట్టి కట్డడాలు కూలిపోయాయి.  ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున గోడ కూలీ ఐదుగురు మృతిచెందారు.

vishada min ఒకే కుటుంబంలో ఇంత ఘోరమైన విషాదం నెలకొనడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని గ్రామస్థులు చెప్పారు. వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.