తెలంగాణ మంత్రికి కరోనా పాజిటీవ్!

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.

ఇది చదవండి : రైతు బంధుపై అపోహలు వద్దు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నిరంజన్‌ రెడ్డి

image 0 compressed 48ఇటీవల తనను కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి జగదీష్‌ రెడ్డి. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలో సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్న విషయం తెలిసిందే.