పంది పాలు తాగిన పిల్లి!.. మరోసారి నిజమైన బ్రహ్మం గారి కాలజ్ఞానం!?.

brahmam garu

పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తారు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు.   వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా … అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి.  అది నిజం అని మనం తెలుసుకునే లోపే  అలాంటిదే మరోహటి ఇప్పుడు జరిగింది.  జడ్చర్లలో   ‘ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది.  శ్రీలక్ష్మీనగర్‌ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు.  పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్‌ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

pig milk compressedబ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాజులు ధర్మంతో పరిపాలించడం మాని విందులు, వినోదాల పట్ల ఆకర్షితు లవుతారని పశువులు పాలు ఇవ్వకపోవడం వల్ల భయంకరమైన కరువు ప్రాప్తిస్తుందని పేర్కొన్నారని ఇప్పుడు చెప్తుంటారు.  ఏదైనా విచిత్రం జరిగితే దానికి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారని కలికాలం అంతరిస్తుందని చెప్పేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ విచిత్రం.    పట్టణాలు, గ్రామాలలో అడవి మృగాలు ప్రవేశించి మనుషులను చంపుకొని తింటాయని  కొందరు ఔత్సాహికులు ఇప్పుడు చెప్తుంటారు. ఏదైనా విచిత్రం జరిగితే దానికి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారని కలికాలం అంతరిస్తుందని చెప్పేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ విచిత్రం.

కాలజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి మాత్రమే చెబుతున్నారు.  కాలజ్ఞానంలో భవిష్యత్తులో ఈ  సమయానికి ఈ విపత్తు జరుగుతుందని చెప్పి ఉంటే దాన్ని బయట  పెట్టాలి. అలాంటిదేదీ ఇప్పటి వరకు జరగలేదు. సునామీ వస్తుందని ముందే చెప్పారని సునామీ వచ్చిన సందర్భం లో మాత్రమే చెప్పారు.  మరి అప్పుడే 2020లో కరోనా వస్తుందని కాలజ్ఞానులు చెప్పిన విషయాన్ని ఎందుకు ప్రచారం చేయలేదు. 2020 వరకు సంగతి వదిలిపెట్టండి. 2021 నుంచి ఏమి ముప్పు వస్తుందో, ఎలాంటి అసాధారణాలు జరుగుతాయో, వాటి గురించి కాలజ్ఞానులు ఏమి ఊహించారో ముందే చెబితే మానవాళి మేలుకొంటుంది కదా!