యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న గణపతి సాంగ్! రాహుల్ సిప్లిగంజ్.. ”గానా చిచ్చా”!!.

Rahul Sipligunj New Ganesh Song - Suman TV

నేటి సింగర్స్ సరికొత్త ట్రెండ్  పండుగలకు, పబ్బాలకు ప్రత్యేక సాంగ్స్ విడుదల చేసి సొమ్ము చేసుకోవడం. ప్లే బ్యాక్ సింగర్స్ గా ఉన్న మంగ్లీ, మోహన భోగరాజు, మధు ప్రియ లాంటి ఈ తరహా ప్రైవేట్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ హిందూ ప్రముఖ పండుగులకు ఖచ్చితంగా ఓ సాంగ్ రూపొందించి, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తారు.   వినాయక చవితి సందర్భంగా గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్‌ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది.  రీసెంట్ గా బిగ్‌ బాస్‌ 3 విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌‌ గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్‌ పాటతో వచ్చాడు.

Rahul Sipligunj New Ganesh Song - Suman TVఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్‌ చేశారు.   ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్‌ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్‌’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది.   వేంగి సుధాకర్‌ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్‌ కా గణేశ్‌’ పాటకు రాహుల్‌ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్‌, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది.

ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్‌ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్‌’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది.