మంత్రి కేటీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో హుజూరాబాద్ జరగబోయే ఉప ఎన్నికల విషయంలో పకడ్భందీ వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే సినీయర్ నేతలు హుజూరాబాద్ పై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం గద్వాల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌కు ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలు షాకిచ్చారు.

kcsatgr minఅలంపూర్ చౌరస్తా లో వంద పడకల ఆసుపత్రి భూమి పూజకు కేటీఆర్ కార్యక్రమానికి హాజరుకానున్నారు కేటీఆర్. ఈ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు, సింగిల్ విండో, మార్కెట్ యార్డ్ మెంబర్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అలంపూర్‌కు మంజూరు అయిన 100 పడకల ఆస్పత్రిని అలంపూర్ చౌరస్తా కు తరలించడం పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్‌కు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తే.. కొంత మంది ఈ విషయంలో జోక్యం చేసుకొని అలంపూర్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరస్తాకు తరలించడం అన్యాయమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రజల నుండి వస్తున్న నిరసనలు, అఖిలపక్ష కమిటీ నుండి వస్తున్న ఒత్తిడి మేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే వంద పడకల ఆసుపత్రి భూమి పూజ కొరకు రేపు జరగబోయే కార్యక్రమానికి కేటీఆర్ పాల్గొనే కార్యక్రమానికి బహిష్కరిస్తున్నామని తీర్మానం చేశారు మండల తెరాస ప్రజా ప్రతినిధులు.