ఓ మందుబాబుకు వింత అనుభవం..

Ciranjee in Beer Bottle

హోటల్‌ కి వెళ్లి ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తే అందులో బొద్దింకలు రావడం. ఆన్‌ లైన్‌ ఆర్డర్‌ చేస్తే ఆహారం రకరకాల వస్తువులు.. జీవులు కనిపించడం చాలా సార్లు చూశాం. అది చాలా వింత అనుభవమనే చెప్పాలి. పిల్లలు తినే చాక్లెట్, శీతల పానీయంలో పురుగులు రావడం, ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అందులో మేకులు వంటివి రావటం మనం నిత్యం చూస్తుంటాం. అలాంటి ఓ వింత అనుభవమే ఒక మందుబాబుకు ఎదురైంది. ఆ దెబ్బకు తాగింది అంతా దిగిపోయింది పాపం.

వివరాల్లోకి వెళ్తే…. కాప్రాలోని ఓ మద్యం షాపుకు వెళ్లిన వ్యక్తి బీరు ఆర్డర్ చేశాడు. అక్కడ ఉండే బేరర్ బీరు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు. బీరు తాగుతున్న సదరు వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే పరిశీలించి చూడాగా ఆ బీరు బాటిలో సిరంజి కనిపించింది. ఆ వ్యక్తి బీరు సీసాలో సిరంజిని చూసి ఒకసారిగా కంగుతిన్నాడు. ఇదేమిటని బార్ నిర్వాహకులను నిలదీసి అడగగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. దీనిపై ఆ వ్యక్తి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.