40 మంది ప్రయాణికులతో వేగంగా పరిగెడుతున్న బస్సు…ఊడిపోయిన టైర్

బస్సులో 40 మంది ప్రయాణికులు..మెరుపు వేగంతో దూసుళ్తున్న బస్సు, హఠాత్తుగా ఊడిపోయిన టైర్. ఇది వినటానికి సినిమాటిక్ స్టైల్ లో ఉన్న అక్షరాల నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా?…తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా సమీపంలో చోటుచేసుకుంది. మనం మాములుగా ఏదైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు సడెన్ గా ముందు టైర్ అయినా వెనుక టైర్ అయినా ఉడునట్టు అనిపిస్తేనే ఎంతో భయపడిపోతాము. అలాంటిది బస్సులో 20 నుంచి 50 మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల బస్సు టైర్లు ఊడిపోతే ఎలా ఉంటుంది.

yadadri district bus issues 01 minతలుచుకుంటేనే భయంగా ఉండే ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని మేటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలో జరిగింది. రోడ్డుపై ఏకంగా మెరుపు వేగంతో పరిగెడుతున్న బస్సు టైర్ ఊడిపోయింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రాణాలను ఒంటి చేత్తో కాపాడాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన బస్సు హైదరాబాదు నుంచి తోర్రరు వెళ్తుండగా జరిగింది. ఆ సమయంలో డ్రైవర్ వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.