నెల క్రితమే పెళ్లి.. భార్య గొంతు, చేతులు, కాళ్లు కట్ చేసి.. దారణంగా

హైదరాబాద్ క్రైం ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న ఆడపిల్లను, ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. పైగా పెద్ద ఎత్తున కట్న కానుకలు ముట్టజెప్పి, ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ కొంత మంది భార్యను ప్రేమగా చుసుకుంటే, మరి కొందరు మాత్రం అదనపు కట్నం కోసమే, మరో కారణం చేతనో హింసిస్తున్నారు. దీంతో చాలా మంది నవ వధువులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేదంటే అనుమానాస్పదంగా చనిపోతున్నారు.

తాజాగా హైదరాబాద్ లో కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త, ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపుతోంది, ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ప్రగతి నగర్ లో జరిగింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన పుట్టల గంగారాం దేవునిపల్లిలో ఉంటున్నాడు. ఆయన కూతురు సుధారాణిని, కామారెడ్డికి చెందిన ఎర్రోల కిరణ్ కుమార్‎కు ఇచ్చి గత నెల 27న పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో కట్న కానుకల రూపంలో 14 లక్షల రూపాయలు, ఒక ఫ్లాట్, 10 తులాల బంగారం ఇచ్చారు.

murder 1

హైదరాబాద్ లో సాఫ్ట్‎వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కిరణ్, ప్రగతినగర్‎లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్‎మెంట్‎లో నివాసముండేవాడు. వివాహం తరువాత భార్యను తీసుకుని కిరణ్ హైదరాబాద్‎కు వచ్చాడు. మరి ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, వారం పది రోజుల క్రితం కిరణ్ సుధారాణిని గొంతునలిమి హత్య చేయబోయాడు. భయబ్రాంతులకు గురైన సుధారాణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు కిరణ్ కుమార్ ను పిలిచి, సర్ది చెప్పి రాజీ కుదిర్చారు.

ఆ తరువాత కిరణ్ భార్య సుధారాణి, తల్లిదండ్రులతో కలిసి వారం రోజుల కిందట మళ్లీ హైదరాబాద్‎కు వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు సుధారాణిని చూడటానికి రావాలని చెప్పి కిరణ్ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులకు శనివారం ఫోన్ చేసి చెప్పారు. ఆ తరువాత కిరణ్ తల్లిదండ్రులు కామారెడ్డికి వెళ్లిపోయారు. ఏంజరిగిందోనని కంగారుతో సుధారాణి తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ కు వచ్చారు. ఇంటి తరుపు లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. మధ్యాహ్నం కావడంతో పడుకున్నారేమో అనుకొని 3 గంటల వరకు వేచిచూశారు.

కాసేపటి తరువాత కూడా ఎతపిలిచినా ఎవ్వరు పలకకపోవడంతో రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, తలుపులు పగులగొట్టి చూడగా, సుధారాణి బెడ్ మీద చనిపోయి ఉంది. ఆమె చేతులు, కాళ్లు, గొంతు కట్ చేసి ఉన్నాయి. పక్కనే కిరణ్ కూడా చేయి, గొంతు కోసుకొని పడి ఉన్నాడు. పోలీసులు కిరణ్‎ను నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుధారాణిని కిరణ్ కుమార్ హత్య చేశాడన్న కోపంతో ఆమె బంధువులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి, ఇంట్లో సామాగ్రి, ఫర్నీచర్, కిరణ్ వాహనాన్ని ధ్వంసం చేశారు.