‘సింగిల్ డోస్’ కరోనా వ్యాక్సిన్ … కమింగ్ సూన్!…

ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోనోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను బ్రిటన్లో పెద్ద ఎత్తున అందిస్తున్నారు
‘సింగిల్ డోస్’ కరోనా వ్యాక్సిన్ మన దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని కోరుతూ అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది. దాంతో పాటు వ్యాక్సిన్ దిగుమతి లైసెన్స్ కూ అనుమతి కోరింది. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీని విజ్ఞప్తి చేసింది.
విదేశీ వ్యాక్సిన్లకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. జాన్సన్ అండ్ జాన్సన్ మూడో ఫేజ్ ట్రయల్స్ కు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 12వ తేదీనే సుగమ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా గ్లోబల్ క్లినికల్ ట్రయల్ డివిజన్ కు జే అండ్ జే దరఖాస్తు చేసుకుందని, అయితే, అందులో చాలా సాంకేతిక అంశాలు ఉన్నందున దరఖాస్తును సవరించి సోమవారం మళ్లీ దరఖాస్తును పున:సమర్పించిందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కొంచెం భిన్నం. మిగతా వ్యాక్సిన్లను రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఒక్క డోసు ఇస్తే సరిపోతుంది. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మూడు నెలల పాటు నిల్వ ఉంచొచ్చని సంస్థ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here