హైదరాబాద్ లో భారీగా తగ్గిన వెండి ధర

భారీగా తగ్గిన వెండి ధర
10గ్రా 22 క్యారెట్ 350 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 390 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,760.
1కిలో వెండి 67,600

బిజినెస్ డెస్క్– ఈ రోజు బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 35 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 39 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 44 వేల 700 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 390 రూపాయలు తగ్గి 48 వేల 760 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 1900 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 600 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 120 రూపాయలు  తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1310 రూపాయలు తగ్గింది.

Silver 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,090 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,980 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,980 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,190 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,490 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.