శ్రుతీ హాసన్.. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో కుమార్తె అయి కూడా కెరీర్లో నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. కమల్ హాసన్ కుమార్తెగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌లతో సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. శారీరకంగా మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా కూడా.. ఆరోగ్యపరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపంది. తన సమస్యల గురించి వివరిస్తూ బుధవారం వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్లతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. హార్మెన్లు బ్యాలెన్స్ తప్పితే ఎలాంటి సమస్యలు వస్తాయో.. మహిళలకు బాగా తెలుసు. అయితే నేను వాటి గురించి బాధపడటం మానేసి సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను.’ ‘ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో మెటబోలిజం కూడా దెబ్బతింటుంది. దానిని ఎదుర్కొనేందుకు సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం, సరైన వ్యాయామం చేయడం చేస్తున్నాను. వీటన్నింటివల్ల మానసికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాను. అయితే చాలా మంది ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ, ఇలాంటి సమస్యలను ఎంతో ధైర్యంగా స్వీకరించాలి. ఆ సమస్యలు మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకోసమే నేను మీతో నా సమస్యలను పంచుకుంటున్నాను’ అంటూ శ్రుతిహాసన్ తన పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. శ్రుతిహాసన్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) వైరల్ అవుతున్న శ్రుతీహాసన్ వర్కౌట్స్ వీడియో కోసం - ఇక్కడ క్లిక్ చేయండి