టీవీలో చంద్రబాబు ఏడ్వటం చూసి వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి

స్పెషల్ డెస్క్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్నపిల్లాడిలా ఏడ్వటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆ స్థితిలో ఎప్పుడూ అయనను చూడని ప్రజలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఓ చిన్నారి సైతం బోరున ఏడ్చేసింది. చంద్రబాబును అలా చూడటంతో ఆ పాపకు ఏడుపొచ్చేసింది. ప్రస్తుతం ఈ ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

chandrababu crying 1

టీవీ చూస్తు ఒక్కసారిగా ఎడుస్తున్న చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అని కుటుంబసభ్యులు అడిగారు. టీవీలో చంద్రబాబు ఏడుస్తున్నాడు.. అందుకే నాకు ఏడుపొస్తుంది.. అంటూ ఆ బాలిక తాను కూడా బోరున ఏడ్చేసింది. తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ఆ బాలిక ఏడుపు ఆప లేదు. చంద్రబాబుకు ఫోన్ చేస్తానంటూ ఆ బాలిక తండ్రి నచ్చచెప్పినా కూడా ఆమె ఏడుస్తూనే ఉంది.

మంచంపై పడుకుని చేతులతో కళ్లు మూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ చిన్నారు. చంద్రబాబును ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయిన చిన్నారి కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యిందని వీడియో చూస్తే తెలుస్తోంది. చంద్రబాబు కన్నీళ్లు చూసు ఏడుస్తున్న ఈ పాప వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఏడ్వటం తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే.