తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే హీరోల్లో మెగస్టార్ చిరంజీవి పేరు ముందుంటుంది. అలాంటిది ఆయన చిత్రంలోని పాటకు.. మెగస్టార్ ముందు డ్యాన్స్ చేసి.. ఆయననే ఫిదా చేశారు హీరోయిన్ ఇంద్రజ. ఈ సంఘటన సుమన్ టీవీ సంతోషం అవార్డుల ప్రధానోత్సవంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : చిరు సినిమాలో లీడ్ రోల్ లో ఆ కంటెస్టెంట్
సుమన్ టీవీ ఎంతో వైభవంగా నిర్వహించిన సంతోషం సుమన్ టీవీ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హజరుకావడమే కాక ఆయన చేతుల మీదుగా పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి ఇంద్రజ.. మెగస్టార్ అప్ కమింగ్ మూవీ ఆచార్య చిత్రంలోని లాహే లాహే పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియో మీకోసం ఇక్కడ ఇస్తున్నాం చూడండి.