భలే మంచి చౌక (చమురు) బేరమూ… రుపాయికే లీటరు!!.

మ‌న దేశంలో పెట్రోల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మళ్లీ పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్ని రోజులు పాటు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడు మళ్లీ రేట్ల మోత మోగిస్తున్నాయి. వరుసగా ధరల పెరుగుదలతో పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరవవుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్టు మ‌న దేశంలో భ‌గ్గుమంటున్నాయి. ఇక గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా లీట‌రు పెట్రోల్ రూ.100వ‌ర‌కు పెరిగింది. దీంతో సామాన్య జ‌నం పెట్రోల్ అంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భారత్‌లో ఆయా రాష్ట్రాలు విధించే పన్నులను బట్టి పెట్రోలు ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టే, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి కారణాల వల్లే ధరల్లో తేడాలు వస్తుంటాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేవ‌లం రూపాయి, రెండు రూపాయ‌ల‌కే లీట‌ర్ పెట్రోల్ వ‌స్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాల్లో వెనెజువెలాది తొలిస్థానం. వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూ1.46 మాత్రమే. ఇక్క‌డ మంచినీళ్ల కంటే పెట్రోల్ చీప్‌గా దొరుకుతుంది.

petrol1 reuters small

భారీ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో సౌదీ అరేబియాది రెండో స్థానం. కానీ పెట్రోలు ధరల విషయంలో మాత్రం ఆ దేశానిది 13వ స్థానం. ఇక ఇరాన్‌లో అయితే రూ.4.24 లీటరు పెట్రోల్ వ‌స్తుంది. అలాగే అంగోలాలో లీటరు పెట్రోల్ రూ.17.88కు దొరుకుతోంది. ఇదిలా ఉంటే కొన్ని దేశాల్లో అయితే లీట‌రు పెట్రోల్ రేటు 100కంటే ఎక్కువే ఉంది. అదెక్క‌డ అంటే హాంగ్ కాంగ్‌లో లీటరు ధర రూ.169.21గా ఉంటే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో రూ.150, సిరియాలో రూ.149 గా ఉంది. అలాగే నెదర్లాండ్స్‌లో కూడా పెట్రోల్ రేటు లీటరుకు రూ.140 వద్ద ఉంద‌ని ఆ దేశాలు చెబుతున్నాయి. ఇలా కొన్ని దేశాల్లో పెట్రోల్ రేటు చీప్‌గా ఉంటే మ‌రికొన్ని దేశాల్లో తారా స్థాయిలో ఉంటున్నాయి.