ట్రెండింగ్‌లో #రిజైన్ జగన్ – ప్రభుత్వానికి అర్ధమవుతోందా!?..

కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. సకల వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన పడుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వారికీ రుయా ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది. ఆసుపత్రిలో అత్యధిక బెడ్లు కలిగిన విభాగాలని ఇప్పుడు కోవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్నాయి. వెయ్యి పడకల కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్నారు. అందులో 135 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. 460 మంది ఆక్సిజన్ బెడ్లపై వైద్యం చేయించుకున్నారు. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో తొలుత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలిని విసిరారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించారు. అప్పటికే 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారని మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్‌ తెలలిపారు. వారి పరిస్థితి డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

003

వారంలో ఇటువంటి సంఘటనలు మరికొన్ని చోట్ల కూడా జరిగాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విటర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు చేశారు.  దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.  కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని ఆవేదన చెందుతున్నారు.