ఆయుర్వేద మందు ! మళ్ళీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం!

గత కొన్ని రోజులుగా నెల్లూరు ఆయుర్వేద మందు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ఎక్కడ పట్టినా ఈ మందు గురించి వార్తలే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.., వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగిపోతు ఉండటంతో ప్రజలకి కూడా ఈ మందుపై గురి కుదిరింది. దీనితో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం జనాలు ఎగబడ్డారు. కానీ.., మీకు గుర్తుందా? ఈ నెల్లూరు ఆయుర్వేద మందు అద్భుతంగా పని చేస్తోందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ.. రెండు రోజుల క్రితం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో హెడ్ మాస్టర్ కోటయ్య.. తాను చావు బతుకుల మధ్య ఇక్కడికి వచ్చానని, కళ్ళలో మందు వేయగానే లేచి కుర్చున్నాని, ప్రయివేట్ హాస్పిటల్స్ లో లక్షలు కట్టినా కోలుకొని తనని.. ఈ మందు బతికించిందంటూ కోటయ్య మాట్లాడుతూ కనిపించాడు. స్వయంగా పేషంట్ తన అనుభవాన్ని పంచుకోవడంతో ఈ వీడియో ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దీని తరువాత నెల్లూరు ఆయుర్వేద ముందుకి మరింత మద్దతు లభించింది. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ..హెడ్ మాస్టర్ కోటయ్యకి అనారోగ్యం తిరగబెట్టింది.

kotiఆయుర్వేద మెడిసిన్ వేసుకున్నప్పటి నుండి ఈరోజు వరకు కోటయ్య బాగానే ఉన్నాడు. ఇక కోలుకుంటున్నాడులే అనుకుంటుండగా ఆనందయ్యకి మరోసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీనితో కోటయ్యను మరోసారి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. ఈ మెడికల్ టెస్ట్ లు అన్నీ పూర్తి అయ్యాకనే ఆనందయ్య ఆయుర్వేద మందు మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి వస్తుందా? లేదా అనే విషయాలు తెలుస్తాయి. కానీ.., ఈ లోపలే కేటుగాళ్లు తమ చేతి వాతం ప్రదర్శిస్తున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు అని చెప్పి కరోనా మందు పేరుతో బ్లాక్మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్ మార్కెట్లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్ ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ప్రజలు ఈ మందుని కూడా బ్లాక్ లో కొనిక్కొని పోతుండటం విశేషం. మరి ఆనందయ్య ఆయుర్వేద ముందుకి క్లీన్ చిట్ ఇచ్చిన హెడ్ మాస్టర్ కోటయ్యకి మళ్ళీ ఆరోగ్యం ఎందుకు క్షీణించి ఉంటుందనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములో తెలియ చేయండి