అకౌంట్‌ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా ఇక మీదట కట్‌ అయ్యే చాన్స్ లేదు!..

Reserve Bank Of India New Rules - Suman TV

ఆర్బీఐ కొత్త రూల్‌.. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌  యూజర్‌ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయ్యి ప్యాకేజీ రెన్యువల్‌ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం ఇక మీదట అలా కుదరదు. ఆటోమేటిక్‌గా పేమెంట్‌ డిడక్ట్‌ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్‌లైన్‌ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నామని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది.  సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. విషయం తెలిసే లోపు సైబర్ క్రిమినల్స్ దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరాలపై కేంద్రం ఫోకస్ చేసింది. సైబర్ నేరాలకు, మోసగాళ్లకు చెక్ చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది.

Reserve Bank Of India  New Rules - Suman TVఖాతాదారుల అకౌంట్‌ నుంచి నెలనెల డబ్బులు ఆటోమేటిక్‌గా కటింగ్‌ అయ్యే విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీల విషయంలో ఇప్పటి వరకూ ఈఎంఐలు, ఓటీటీ రెన్యువల్‌ ప్లాన్స్‌ ఇతర ఆన్‌లైన్‌ చెల్లింపులన్నీ ఆటోమేటిక్‌గా నిర్ణీత తేదీ వచ్చే సరికి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్‌ అవుతుంటాయి. ఇకపై అలాంటిదేమి జరగదని, ఇక నుంచి ఖాతాదారుల నుంచి అదనపు ధృవీకరణ తర్వాత డబ్బులు కట్‌ అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకుల తరపు నుంచి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది.. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది.

రిజిస్ట్రేషన్  సమయంలో, మొదటి ట్రాన్‌జాక్షన్‌, ప్రీ ట్రాన్‌జాక్షన్‌ నోటిఫికేషన్‌, విత్‌డ్రా కోసం ఏఎఫ్‌ఏ తప్పనిసరని, ఇదంతా యూజర్‌ భద్రత కోసమేనని ఆర్బీఐ అంటోంది.  ఈ రూల్‌అమలులోకి రాగానే  బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని వెల్లడించింది.  ఇంటి రుణం(హోమ్ లోన్స్), వాహన రుణం(వెహికల్ లోన్స్), మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎల్‌ఐసీ వంటి కొన్ని సేవలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ సేవలు, డీటీహెచ్‌ బిల్లులు, ఫోన్‌ బిల్లులు వంటి సేవలకు ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవ్వవు.