ప్రభాస్ పై మనసు పారేసుకుంది.. డార్లింగ్ తో డేట్ కు రెడీ అంటున్న రష్మిక

ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన్న.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులను పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గీతగోవిందం మంచి విజయం సాధించడంతో రష్మికకు వరుస అవకాశఆలు వచ్చాయి. దీంతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రష్మిక. ఆమె అదృష్టమో లేక కధలు ఎన్నుకునే విధానమో తెలియదు గాని రష్మిక చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పవచ్చు.

rashmika

ఒకటి రెండు సినిమాలు మినహా రష్మిక సినిమాలన్ని సక్సెస్ సాధించడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అన్న పేరు వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. రష్మిక సినిమాలో ఉంటే ఇక ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడింది చాలా మంది నిర్మాతలకు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక జోరు మరింత పెరిగింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది రష్మిక. ఇక ఈ కన్నడ సోయగం తాజాగా తన మనసులోని మాటను చెప్పేసింది. తనకు డార్లింగ్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రభాస్ కు తాను పెద్ద అభిమానినని, ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.

అంతే కాదు ఛాన్స్ రావాలే గాని ప్రభాస్ తో డేట్ కు సిద్దమని హొయలు పోతూ అంటోంది. మరి రష్మిక డేట్ కోరికపై డార్లింగ్ ప్రభాస్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు, అభిమానుల్లోను ఆసక్తి నెలకొంది. అన్నట్లు రష్మిక తెలుగులో నటించక ముందే ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్ధం అయ్యంది. ఐతే వేరే కారణాల వల్ల ఈ పెళ్లి పీటల వరకు రాకుండానే ఆగిపోయింది. దీంతో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చాలా సందర్బాల్లో చెప్పింది రష్మిక.