ఆర్జీవీ ఇంట్లో విషాధం.. బోణీకపూర్ ఎమోషనల్ ట్వీట్

ఫిల్మ్ డెస్క్- కరోనాకు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏ మాత్రం లేదు. అవకాశం ఉన్న ప్రతి వారిమీద దండయాత్ర చేస్తూనే ఉంది ఈ మహమ్మారి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ దర్శకులు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆర్జీవి దగ్గరి బంధువు, సోదరుడు సోమశేఖర్ కరోనా సోకి మరణించారు. దీంతో రాము ఇంట్లో విశాధ ఛాయలు అలముకున్నాయి. వర్మ సోదరుడు సోమశేఖర్ కూడా సినిమా రంగానికి చెందినవారే. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఐతే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సోమశేఖర్, ఇతర బిజీనెస్ లు చూసుకుంటున్నారు.

somashekar

అయితే సోమశేఖర్ కంటే ముందే ఆయన తల్లికి కరోనా వైరస్ రావడంతో ఆమెకు సేవలందించారు. తల్లి మీద ప్రేమతో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో తన ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేదు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొదట్లో అంతా బాగానే ఉందని చిన్నప్పటి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ మహమ్మారి అతి తక్కువ సమయంలోనే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లిని కాపాడుకోబోయి సోమశేకర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచి వేసిందంక్ బోణి కపూర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని, సోమశేఖర్ తో ఎన్నోసినిమాలకు కలిసి పనిచేసిన అనుభవాలు ఇంకా మరచిపోలేదని బోణీ కపూర్ గుర్తు చేసుకున్నారు.