ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలలో మరింత జాప్యం జరుగుతోందా!??

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆగోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. ఆస్పత్రి నుచి డిశ్చార్జి సమర్మరీని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ కోరారు. అయితే, ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆయన తరుపు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపడంతో రఘురామ విడుదల వాయిదా పడింది. ఈరోజు సీఐడీ కోర్టులో జరిగిన వాదనల ప్రకారం ఆయన విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈరోజు సీఐడీ కోర్టులో షూరిటీని ప్రొడ్యూస్‌ చేశారు రఘురామకృష్ణరాజు తరఫు లాయర్లు.

tp72vezmynw0jtgo 1621058819

ఈ సందర్భంగా రఘురామ డిశ్చార్జ్‌ రిపోర్టు సబ్‌మిట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. రఘురామ డిశ్చార్జీకి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని ఆర్మీ ఆస్పత్రి తెలపడంతో.. అదే విషయాన్ని కోర్టుకు తెలిపారు లాయర్లు. దీంతో బెయిల్‌ విచారణ వాయిదా పడింది. రఘురామ విడుదల మరింత ఆలస్యం అవుతుందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామ ఫిట్‌గా ఉన్నపుడే విడుదల ఉంటుందన్నారు. దీంతో మరో మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.