పవన్ ఓడాడని అప్పుడు విమర్శ.. మరిప్పుడు కమల్ ఏంచెబుతాడు

pawan vs kamal

స్పెషల్ డెస్క్- రాజ‌కీయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. యేళ్ల తరబడి ఎన్నో డక్కాముక్కీలు తిన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు. అంతే కానీ ఇలా వచ్చి ఇలా ఎమ్మెల్యే, ఎంపీనో అవుదామంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. ఇది సినిమా వాళ్లకైతే బాగా అర్ధమవుతుంది. ఎందుకంటే సినిమాల్లో సూపర్ స్టార్ అయినవాళ్లే రాజకీయాల్లో బొక్కా బోర్ల పడ్డవాళ్ళు కోకొల్లలు అని చెప్పవచచ్చు. సినిమాల్లో ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన వాళ్లు రాజ‌కీయాల్లో అట్టర్ ప్లాఫ్ అయిన వారు చాలా మంది ఉన్నారు.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌ పార్టీ పెట్టి ఏపీ ఎన్నికల్లోకి దిగితే.. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన సంగతిని చూశాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలవలేని పరిస్థితి. ఇక తాజాగా తమిళనాడుతో కమల్ హసన్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. 142 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోరంగా ఓటమిపాలైంది. కనీసం పార్టీ అధినేతగా ఉన్న కమల్ హాసన్ సైతం గెలవలేదు. దీంతో ఇప్పుడు కమల్ హాసన్ పై అంతా సెటైర్లు వేస్తున్నారు.

ఎందుకంటే గతంలో ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన అంశాన్ని మొన్న ఎన్నికల్లో గుర్తు చేసిన కమల్.. తాను మాత్రం పవన్ లా కాదని. ఎవరికి తలొగ్గనని.. ఎన్నికల్లో గెలిచి తీరుతానని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి పవన్ పై సెటైర్లు వేసిన కమల్ హాసన్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పవన్ జనసేని పార్టీ నుంచి కనీసం ఒక ఎమ్మెల్యే అయినా గెలిచారని.. కమల్ పార్టీ నుంచి కనీసం ఒక్కరు కూడా గెలవలేదని ఎద్దేవా చేస్తున్నారు జనసైనికులు.