రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా ఉధృతి పెరగకపోతే.. ఈ పాటికి రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్ఆర్ఆర్ మేనియాతో ఊగిపోయేవి. కానీ అభిమానుల ఆశలపై కరోనా, ఒమిక్రాన్ రెండు కలసి మూకుమ్మడిగా నీళ్లు చల్లాయి. ఈ దెబ్బకు సినిమా విడుదల కాస్త 2022, ఏప్రిల్ కి వాయిదా పడింది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి ఓ క్రేజీ వార్త ప్రస్తుతం వైరలవుతోంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆర్ఆర్ఆర్ కు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : ‘RRR’ కారణంగా NTR బాగానే నష్టపోయాడుగా..
ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్.. ఆర్ఆర్ఆర్ మేకర్స్‌కు అమేజింగ్ ఆఫర్ ఇచ్చింది. అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకుపైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్టైనర్లను కొనుగోలు చేస్తుంది. అంటే పలు పెద్ద చిత్రాలను కొనుక్కొని పే-పర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. ఎక్కువగా అమెరికన్ మార్కెట్ లో ఈ పని చేస్తుంది. కానీ భారతీయ మార్కెట్లో ఇలాంటి ప్రయోగం మాత్రం ఇప్పటివరకూ చేయలేదు అమెజాన్. అలాగే యూట్యూబ్‌లో కూడా కొన్ని సినిమాలను అద్దెకు చూడవలసి ఉంటుంది. అలాంటి సినిమాలను నిర్ణీత ధరతో ఒక రోజు కోసం అద్దెకు తీసుకుంటుంది. ఇలాంటి ఆఫర్‌ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అమెజాన్ ఇచ్చింది. దీని ద్వారా సులభంగా రూ. 200 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలిపిందట.
ఇది కూడా చదవండి : RRR-ఎన్టీఆర్ కు జాతీయ అవార్డ్, రామ్ చరణ్ ఆత్మ
అయితే ఈ ఆఫర్ ని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఒప్పుకోలేదని సమాచారం. థియేటర్లలో విడుదల చేస్తే వచ్చే కలెక్షన్లతో పోల్చితే.. ఈ ఆదాయం చాలా తక్కువ అని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ నుంచి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అలా అయితేనే సినిమాకు పెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో తిరిగి పొందగులుగుతారు. అందుకే అమెజాన్ ఆఫర్ ని తిరస్కరించిటన్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2022, ఏప్రిల్ 1, లేదా 29న విడుదల చేస్తారని సమాచారం. ఏది ఏమైనా అమెజాన్ మాత్రం భారీ ఆఫర్ ను ప్రకటించింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమా.. ఎప్పుడంటే!