ఒక్క ఊపిరితిత్తితో మహమ్మారిని గెలిచిన నర్స్! షాక్ లో డాక్టర్స్!

భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది. ఆశ క్యాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. అవ్వడానికి ఇది సినిమా డైలాగే అయినా అక్షర సత్యం. ఈ విషయాన్నే నిజం చేసి చూపించింది మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఫులిత్ పీటర్ అనే నర్సు. ఒకవైపు దేశంలో ప్రజలు కరోనా దెబ్బకి విలవిలలాడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొంత మందికి ఆక్షిజన్ అందక హాస్పిటల్స్ పాలవుతున్నారు. అక్కడ కూడా సరైన సమయానికి ఆక్సిజన్ అందని వారు ప్రాణాలను వదిలేస్తున్నారు. కానీ.., ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ఈ మహిళ తన గుండె ధైర్యాన్ని చాటుకుంది. మనిషి తలుచుకుంటే చావునైనా ఎదిరించవచ్చని రుజువు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సు ప్రఫులిత్ పీటర్ గురించే ఈ స్టోరీ. ప్రఫులిత్ పీటర్ తన చిన్న తనంలో ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో ప్రఫులిత్ పీటర్ ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ అయిపోయింది. అది బాడీలో ఉండటం కూడా మంచిది కాదని డాక్టర్స్ దాన్ని తొలగించారు. ఆ విషయం ప్రపులిత్ కు కూడా తెలియకుండానే పెద్దది అయ్యింది. కట్ చేస్తే.., 2014లో ఒంట్లో నలతగా ఉండి.. ప్రపులిత్ ఎక్స్ రే తీపించుకుంది. తనకు ఒక్క ఊపిరితిత్తి మాత్రమే ఉందన్న విషయం ఆమెకి అప్పుడే తెలిసింది. కానీ.., ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరిగి పెద్దది అయ్యింది. ఇప్పుడు ప్రపులిత్ కు 39 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ లోని ఓ హాస్పిటల్ లో నర్స్ నర్స్‌గా పనిచేస్తోంది. కొన్ని నెలలుగా కరోనా రోగులకు సేవలు చేస్తున్న క్రమంలో ప్రపులిత్ కి కరోనా సోకింది. దీనితో.. ఒక్క ఉపిరితిత్తి మాత్రమే ఉన్న ప్రఫులిత్ పీటర్ కి ఆక్సిజన్ సమస్యలు తలెత్తుతాయని అంతా భయపడ్డారు. కానీ.., ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి..వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఒక్క ఊపిరితిత్తితో కరోనాను జయించిన ప్రపులిత్ కోలుకున్న తరువాత తన అనుభవాన్ని బయటపెట్టింది. నాకు కరోనా సోకింది అని తెలియగానే భయపడలేదు. హోం ఐసోలేషన్లోకి వెళ్లి యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. ముఖ్యంగా ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. పైగా.., నేను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాను. మొత్తంగా నా ధైర్యమే నన్ను గెలిపించిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె మాటలు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కోవిడ్ పేషంట్స్ లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఈమె చెప్పిన బెలూన్ బూస్టప్ అద్భుతమైన పక్రియ అద్భుతం అంటూ నిపుణులు కూడా మెచ్చుకుంటున్నారు. నిజంగా హేట్సాఫ్ టూ ప్రఫులిత్ పీటర్ .